ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమా ఈ శుక్రవారం అనగా జూలై 11 వ తేదీన విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి అంతలా ఈ సినిమా విడుదల వాయిదా కావడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి ..? అలాగే ఈ సినిమాలోని అనేక సన్నివేశాలకు సెన్సార్ బోర్డు వారు కట్లు కూడా విధించారు. అంతలా ఈ సినిమాలో ఏమి ఉంది ..? అసలు ఈ సినిమా వెనక దాగి ఉన్న కథ ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

కొంతకాలం క్రితం కాశ్మీరీ ఫైల్స్ , ది కేరళ ఫైల్స్ అనే టైటిల్స్ తో సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్న విషయాలు మన అందరికీ తెలిసిందే. ఇక ఆ కోణంలోనే ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఉదయ్‌పూర్ ఫైల్స్ సినిమా ఈ శుక్రవారం (జూలై 11) విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందు  ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. అలాగే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని చెప్పిన సుప్రీంకోర్టు సినిమాను విడుదల చేయనివ్వండి అని కూడా చెప్పింది. కానీ ఉదయపూర్ ఫైల్స్ మూవీ పై ఢిల్లీ హైకోర్టు విడుదలపై స్టే విధించింది. ఇక అసలు


విషయం లోకి వెళితే ... 2022 వ సంవత్సరంలో రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌లో జరిగిన దర్జీ కన్హయ్య లాల్ హత్య కేసు ఆధారంగా ఈ మూవీ ని తెరకెక్కించారు.  ఢిల్లీ హైకోర్టులో తాజాగా ఈ విషయంలో అనేక వాదనలు జరిగాయి. చివరకు ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా విడుదలను వాయిదా కూడా వేసింది. ఈ సినిమా విడుదల వాయిదా విషయంలో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి  భరత్ శ్రీనేట్ స్పందిస్తూ ... ఉదయపూర్ ఫైల్స్ సినిమా అనేది  మతాన్ని లేదా వ్యక్తిగత విశ్వాసాన్ని ఉద్దేశించిన సినిమా అస్సలు కాదు. ఇది కేవలం ఒక నిజం గురించి మాట్లాడే సినిమా మాత్రమే. ఎటువంటి ద్వేషాన్ని , విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ఉదయపూర్ ఫైల్స్ మూవీలో లేదు అని ఈ మూవీ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: