టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా పేరుపొందిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేదు. అయినా కూడా వరుస సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది. చివరిగా తెలుగులో రాధే శ్యామ్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చినా కూడా ఎందుకో ఆ సినిమాని రిజెక్ట్ చేసింది. అప్పటినుంచి. అవకాశాలు మాత్రం పూజ హెగ్డే అందుకోలేకపోతోంది ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ అపిరియాన్స్ పాత్రలో కనిపించింది.


కాని తమిళంలో పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అక్కడ హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలను స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించడానికి సిద్ధమయ్యింది పూజా హెగ్డే. ప్రస్తుతం కూలి సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తూ ఉండగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న విడుదల కాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా పూజ హెగ్డే ఇందులో మోనికా పాత్రలో స్పెషల్ సాంగ్ చేసింది.


ఇటీవలే విడుదలైన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. తరచూ తన సినిమాలలో చేసే థైస్ షో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది పూజా హెగ్డే. దీనివల్ల కూలి సినిమాలో కూడా ఈ సాంగ్ భారీ పాపాలరీటి సంపాదించుకుంది. ఈ స్పెషల్ సాంగ్ కూడా మలయాళ నటుడు సాబిన్ షాహిర్ స్టెప్పులు వేయడం మరింత హైలెట్ గా నిలిచింది. మొత్తానికి వీరిద్దరితో ఈ స్పెషల్ సాంగ్ ఒక ఊపు ఊపేస్తోంది సోషల్ మీడియాలో. సినిమాలలో నటించిన క్రేజీ కంటే స్పెషల్ సాంగ్ లో నటించడం వల్లే పూజా హెగ్డే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకట్టుకోలేదు. అలాగే జననాయగన్, కాంచన 4 వంటి చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ చిత్రాలన్నిటికీ కూడా కూలి సినిమా స్పెషల్స్ అంటే గ్రేస్ తీసుకువచ్చేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: