
ఇక ఇదే సందర్భంలో త్రిప్తి, ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న ‘స్పిరిట్’ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె వ్యాఖ్యల స్టైల్, టోన్ చూసిన వారెవరికైనా అర్థమయ్యేలా ఉంది – త్రిప్తి చాలా ఆచితూచి, తెలివిగా మాట్లాడిందని. ఓ ఇంటర్వ్యూలో "మీకు స్పిరిట్ సినిమా గురించి ఏమైనా తెలుసా? అందులో మీరు ఉంటారా?" అని విలేకరి అడిగిన ప్రశ్నకు త్రిప్తి చిరునవ్వుతో సమాధానమిస్తూ, “స్పిరిట్ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. అది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అవుతుంది అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇక్కడ విశేషం ఏంటంటే – స్పిరిట్ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా దీపికా పదుకోనే పేరు చక్కర్లు కొడుతున్నప్పటికీ, త్రిప్తి ఈ విషయాన్ని పూర్తిగా మినహాయించి మాట్లాడడం గమనార్హం. దీపిక పేరును ప్రస్తావించకుండా, తనకు సంబంధం ఉన్నట్టుగా కూడా మాట్లాడకుండా, అంతే సమయంలో సినిమాను పొగడుతూ బలమైన కామెంట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు "త్రిప్తి డిప్లొమాటిక్‌గా బాగానే ఆడింది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో త్రిప్తి తనకు ఎంతో నచ్చిన డైరెక్టర్లలో ఒకరైన విశాల్ భరద్వాజ్‌తో చేస్తున్న కొత్త సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఉందని చెప్పింది. ఆ సినిమా స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి ఎంతో ఇంప్రెస్ అయిందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపింది.
ఇక 'స్పిరిట్' ప్రాజెక్ట్ విషయానికి వస్తే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రభాస్‌తో చేసిన అనౌన్స్‌మెంట్‌లో, ఇది ఇంటెన్స్ పోలీస్ డ్రామా అని చెప్పడం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రిని ఓకే చేశాడు . ఇక ఇప్పుడు త్రిప్తి వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంకొంత హైప్ క్రియేట్ అయినట్టే. తన మాటలతో కాంట్రవర్సీకి తావు లేకుండా ఉండేలా చూసుకున్న త్రిప్తి తెలివిని చూసిన ఫ్యాన్స్, “ఇది త్రిప్తి బ్రాండ్ ఇంటెలిజెన్స్” అంటూ మెచ్చుకుంటున్నారు. మరి స్పిరిట్‌లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా సందీప్ రెడ్డి వంగా లేదా మేకర్స్ నుంచే అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే!