
తమిళంలో `రివాల్వర్ రీటా`, `కన్నివేది` అనే చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో తరచుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ ఓ పాల్గొన్న కీర్తి సురేష్.. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే మూడ్ బాగోపోతే ఏం చేస్తానో రివీల్ చేసింది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. `అప్పుడప్పుడు నేను కూడా మూడాఫ్ అవుతుంటాను. ఆ టైమ్‌లో ఫుల్ గా ఫుడ్ లాగించేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాను. కారులో మంచి మ్యూజిక్ వింటాను. ఇక నాకొక పెట్ డాగ్ ఉంది. మూడాఫ్ అయినప్పుడు దాంతో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసిన చాలు మొత్తం సెట్ అయిపోతుంది` అంటూ చెప్పుకొచ్చింది. కాగా, కీర్తి సురేష్ ఇటీవల మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రియుడు ఆంటోనీ థాటిల్‌ను గత ఏడాది డిసెంబర్ లో కీర్తి పెళ్లాడింది. కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీ వ్యాపారరంగంలో స్థిరపడ్డారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు