మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల ముద్దుగుమ్మ నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే పూర్తయింది. అనిల్ రావిపూడి అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఈ మూవీ లాంచింగ్ డే నాడే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న స్పీడును బట్టి చూస్తే ఈ మూవీ యొక్క టోటల్ షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా షూటింగ్ గనక సెప్టెంబర్ చివరి వరకు కంప్లీట్ అయినట్లయితే ఆ తర్వాత అక్టోబర్ , నవంబర్ , డిసెంబర్ ఈ మూడు నెలలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్లను చేయాలి అని అనిల్ రావిపూడి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ప్రస్తుత షెడ్యూల్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి , నయనతార పాల్గొంటున్నట్లు సమాచారం. కేరళలోని అద్భుతమైన లోకేషన్లలో ప్రస్తుతం ఈ మూవీ బృందం చిరంజీవి , నయనతార పై ఒక అద్భుతమైన సాంగ్ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందిస్తున్నాడు.

చిరంజీవి హీరో గా నటిస్తున్న మూవీ కావడం , అపజయం అంటూ ఎరగని అనిల్ రావిపూడిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: