నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొంత కాలం క్రితం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరికొంత కాలం లోనే మరో మూవీ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో 111 వ మూవీ గా రూపొందనుండడంతో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఎన్బికె 111 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇది ఇలా ఉంటే గోపీచంద్ మలినేను ఈ మధ్య కాలంలో రూపొందిస్తున్న సినిమాల్లో లేడీ విలన్స్ పాత్రలు కామన్ గా ఉంటున్నాయి. కొంత కాలం క్రితం ఈయన క్రాక్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించిన సముద్ర కని  కి భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ మూవీ లో ఈమె నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇక క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేను బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శృతి  హాసన్ హాని రోజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో దునియా విజయ్ విలన్గా నటించగా  ... ఆయనకు భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ సినిమాలో కూడా ఈమె నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇక కొంత కాలం క్రితమే గోపీచంద్ మలినేని హిందీ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ లో రెజీనా నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇలా ఈయన వరుసగా రూపొందించిన మూడు సినిమాల్లో కూడా లేడీ విలన్ పాత్రలు ఉన్నాయి. దానితో ఈ దర్శకుడు తదుపరి మూవీ అయినటువంటి ఎన్బికె 111 లో కూడా లేడీ విలన్ పాత్ర ఉంటుందేమో అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఎన్బికె 111 లో లేడీ విలన్ పాత్ర ఉంటుందా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk