
రష్మిక ఇతర హీరోయిన్లను భిన్నంగా బిజినెస్ కు సంబంధించి భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడం కొసమెరుపు. అమ్మకు కాల్ చేశానని దేవుడి ఆశీర్వాదం కావాలని గత కొంతకాలంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వార్తల్లో నిలిచిన రష్మిక మందన పెర్ఫ్యూమ్ ను లాంచ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. సేంట్ నా జీవితంలో భాగమని ఆమె పేర్కొన్నారు. ఆ పరిమళాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నానని ఆమె అన్నారు.
నాకు చాలా ఉత్సాహంగా ఉందని అదే సమయంలో భయంగా కూడా ఉందని ఆమె కామెంట్లు చేశారు. దీనిని ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ఆమె అన్నారు. రష్మిక తన కొత్త బ్రాండ్ ను గ్రాండ్ గా ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. రష్మిక పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.
ఒక్కో సినిమాకు రష్మిక 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. రష్మిక తన సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్మిక భవిష్యత్తులో మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రానున్నాయని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రష్మిక సరైన ట్రాక్ లో అడుగులు వేస్తే మరికొన్ని సంవత్సరాల పాటు ఆమె కెరీర్ కు ఢోకా ఉండదని చెప్పవచ్చు.