
తన ఇంటికి వచ్చి కొంతమంది తనని వేధిస్తున్నారని ఈ బాధ తట్టుకోలేకపోతూ ఈ వీడియోని చేస్తున్నానంటూ తెలిపింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోతోంది.రేపో మాపో పోలీసుల దగ్గరకు కూడా వెళ్తానంటూ తెలియజేసింది తను శ్రీ దత్తా.. ఈ విషయంపై తనకు ఎవరైనా వచ్చి సహాయం చేయండి అంటూ ఏడుస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. తనకు ఆరోగ్యం కూడా బాగా లేదంటూ తెలిపింది. 2018లో మీటూ ఉద్యమంలో భాగంగా నానా పటేకర్ అనే నటుడు పైన పలు సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని కేసు పెట్టినప్పటికీ కూడా ఈ కేసులో నటుడు పటేకర్ క్లీన్ చిట్ దక్కింది.
తను శ్రీ దత్తా విషయానికి వస్తే 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఆషిక్ బనాయా అప్నే అనే చిత్రంతో భారీ పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులో బాలకృష్ణ నటించిన వీరభద్ర అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎలాంటి చిత్రంలో కూడా కనిపించలేదు. చివరిగా 2013లో హిందీ చిత్రాలలో నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం తను శ్రీ దత్తా షేర్ చేసిన ఈ వీడియో మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి