పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు ట్వీట్లు వేస్తూ సినిమా బాగుండాలని హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ టాలీవుడ్ లోని ఆ ఇద్దరు బడా నిర్మాతలు మాత్రం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఏ ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. దీంతో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవాలని ప్లాన్ చేసింది వీళ్లే.. మళ్ళీ సినిమా విడుదల అయ్యే టైంలో కూడా కనీసం ట్వీట్  వేయలేదంటే వీరికి పవన్ కళ్యాణ్ పై ఎంత పగుందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే ఒక్క ట్వీట్ కూడా వేయని ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిపోయింది. ఇక ఒకరోజు ముందే అర్ధరాత్రి నుండే ప్రీమియర్ షోస్ కూడా పడిపోయాయి. ఇప్పటికే  సినిమా చూసిన చాలామంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇక సినిమా హిట్ అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, అంబటి రాంబాబు వంటి ఎంతో రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు కూడా ట్వీట్లు వేసి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కు మరింత బూస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఉన్న సితార నాగ వంశీ, దిల్ రాజు ఈ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. కనీసం మాటవరసకైనా హరిహర వీరమల్లు సినిమా బాగుండాలని చిన్న ట్వీట్ వేయకపోవడంతో ఈ ఇద్దరు నిర్మాతలపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

అయితే హరిహర వీరమల్లుకి పోటీగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతోంది. వారం రోజుల వ్యవధితో విడుదల కాబోతున్న కింగ్డమ్ సినిమాకి నాగ వంశీ నిర్మాతగా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సినిమాని సపోర్ట్ చేయని నాగ వంశీకి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాకి ట్వీట్ వేసి సపోర్ట్ చేయనప్పుడు కింగ్డమ్ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చూస్తారో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ బడా నిర్మాతలు అయినటువంటి దిల్ రాజు,నాగ వంశీలపై సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. కింగ్డమ్ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తాం అన్నట్టుగా కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: