
నాని హీరో గా రూపొందిన నేను లోకల్ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో వీరి జంటకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఆ తర్వాత వీరి కాంబోలో దసరా అనే సినిమా కూడా వచ్చింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నాని , సాయి పల్లవి కాంబోలో కూడా రెండు సినిమాలు వచ్చాయి. నాని , సాయి పల్లవి కాంబోలో మొదటగా ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో శ్యామ్ సింగరాయి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నాని హీరో గా రూపొందిన నాలుగు సినిమాల్లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటించారు. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలా ఈ ఇద్దరు హీరోయిన్లు నాని కి అద్భుతంగా కలిసి వచ్చారు.