సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎంతోమంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వేర్వేరు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. స్టార్ హీరోయిన్లు సైతం ఒకానొక సమయంలో ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరోలకు జోడీగా నటించాలంటే క్యాస్టింగ్ కౌచ్ కు అంగీకరించాలని కూడా జోరుగా ప్రచారం జరుగుతుండటం కొసమెరుపు.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలంటే హీరోయిన్లు కొన్ని నిబంధనలకు తలొగ్గాల్సి ఉంటుందని  చాలామంది భావిస్తారు.  సినిమా ఇండస్ట్రీలో నట వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు సైతం ఈ తరహా అనుభవాలు ఎదురైన సందర్భాలు అయితే ఎక్కువగా ఉన్నాయని  చెప్పవచ్చు.  కామెడీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న  జామీ లివర్  తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించింది.

ఈ నటి తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాలను  గురించి చెప్పుకొచ్చారు.  ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అల్లరి నరేష్ కు  వదినగా  ఈ నటి నటించారు.  తాజాగా ఈ నటి మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో  నాకు మేనేజర్ అంటూ ఎవరూ  ఉండేవారు కాదని  ఎవరు ఆడిషన్ కు పిలవాలన్నా నాకే ఫోన్ వచ్చేదని ఆమె తెలిపారు.  ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ మూవీలో ఛాన్స్ అంటూ నాకు కాల్ చేశాడని ఆమె తెలిపారు.

ఆ వ్యక్తి నీ ముందు 50  ఏళ్ళ వ్యక్తి ఉన్నట్టు ఊహించుకుని  బట్టలు విప్పాలని చెప్పాడని  వీడియో కాల్ లో నాకు కంఫర్ట్ గా ఉండదు అని చెప్పినా అతను మాత్రం వినలేదని పాత్రకు సెట్ అవుతావో లేదో చూడాలి కదా అని అన్నాడని ఆమె పేర్కొన్నారు.  ఆ తర్వాత నాకు కంఫర్ట్ గా  అనిపించక నేను కాల్ కట్ చేశానని ఆమె వెల్లడించారు.  అప్పటివరకు నాకు క్యాస్టింగ్ కౌచ్ అంటే తెలియదని ఆమె వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: