
అలా ఇంటి నుంచి బయటికి వచ్చి మరి తానే సొంతంగా తన కాళ్ళ మీద నిలబడేందుకు సిద్ధమయ్యింది. అలా నిర్మాతగా మారిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నది. నిహారిక ఒక ఇంటర్వ్యూలో విడాకుల వ్యవహారం గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. చాలామంది తనది ప్రేమ వివాహం అని అనుకుంటున్నారు. కానీ అసలు విషయం మీకేం తెలుసు తాము ఎందుకు విడిపోయాం అన్నది తమ యొక్క వ్యక్తిగతం అంటూ నిహారిక తెలిపింది.
నాకు తగిలిన దెబ్బ నొప్పి నాకే తెలుస్తుంది అంటూ నిహారిక తెలిపింది. తన తండ్రి ఎప్పుడూ కూడా తనని భారంగా అనుకోలేదని ఒక బాధ్యతగా అనుకున్నారు.. తన తండ్రి తనకు ఎంతో సపోర్టు ఇచ్చారని.. అలాగే అన్నయ్య కూడా తనకి అండగా ఉన్నారని నిహారిక చాలా బాగోద్వేగంతో తెలిపింది. అయితే ఇటీవలే నిహారిక రెండవ పెళ్లి పైన కూడా వార్తలు వినిపించగా నాగబాబు రెండవ పెళ్లి మాత్రం నిహారిక కే వదిలేస్తున్నామని ఆమె ఎప్పుడు ఓకే అంటే అప్పుడే చేస్తామంటూ తెలియజేశారు. ఈ మధ్య తమిళ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది.