జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ మూవీ టీజర్ కు ముందు ఈ సినిమాలో తారక్ , హృతిక్  లలో ఎవరు హీరోగా కనిపించబోతున్నారు ..? ఎవరు విలన్ గా కనిపించబోతున్నారు అనే క్లారిటీ పెద్దగా లేదు. ఈ సినిమా టీజర్ విడుదల అయ్యాక కూడా జనాల్లో ఆ కన్ఫ్యూజన్ మరింతగా పెరిగింది.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ద్వారా క్లియర్గా ఈ సినిమాలో తారక్ విలన్ పాత్రలో , హృతిక్ నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలిసిపోతుంది. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు ముందు ఈ సినిమాపై పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు జనాల్లో నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం అద్భుతంగా ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ ఆయువుతోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో కియార అద్వానీ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ కూడా కనిపించబోతున్నట్లు , ఈమె పాత్ర నిడివి ఐ మూవీలో తక్కువ గానే ఉండనున్నట్లు కానీ ఈమె పాత్ర ద్వారానే కథ మొత్తం మలుపు తిరగనున్నట్లు ఓవర్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఆలియా భట్ నిజంగానే కనిపించనుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: