సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా ఉండే వ్యక్తులలో ఉర్ఫీ జావెద్ ఒకరు. ఆమె దుస్తులు, ప్రవర్తన పట్ల నెటిజన్లలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆమె తనకి బాడీ డిస్మార్ఫియా ఉందని బహిరంగంగా ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఒక వ్యక్తి తన శరీరంలోని ఏదో ఒక భాగం గురించి లేదా తన మొత్తం రూపం గురించి విపరీతమైన ఆందోళన చెందడం ఈ వ్యాధి లక్షణం.

ఈ ఆందోళన ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అది వారి రోజువారీ జీవితాన్ని, సామాజిక సంబంధాలను, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. కడుపు మాడ్చుకోవడం వల్ల తనకు ఈ వ్యాధి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.  బయటి వారికి ఆ లోపం పెద్దదిగా అనిపించకపోయినా, బాడీ డిస్మార్ఫియా ఉన్న వ్యక్తికి అది కొండంత సమస్యగా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

ఈ తరహా సమస్యతో బాధ పడేవాళ్ళు  నిరంతరం తమ లోపాలను పరిశీలించుకుంటూ, ఇతరులు తమని ఎలా చూస్తున్నారోనని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈమె లిప్ ఫిల్లర్స్ వేయించుకోవడంతో పాటు వాటిని తీయించుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఈ చికిత్స వల్ల అప్పటివరకు అందంగా కనిపించిన ఈమె ముఖం ఉబ్బిపోయి అందవిహీనంగా కనిపించింది. నాలుగేళ్ల క్రితం చాలా సన్నగా కనిపించాలని చేసిన పనుల వల్ల  ఈ వ్యాధి బారిన పడ్డానని ఆమె అన్నారు.

నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండేదాన్నని ఆమె పేర్కొన్నారు.  సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మూడ్  స్వింగ్స్ ఎక్కువగా ఉండేవని  ఆ తర్వాత పద్దతి మార్చుకున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం జిమ్ కు వెళ్తున్నానని బరువులు ఎత్తుతున్నానని బాగా తింటున్నానని  సన్నగా ఉండాలని అస్సలు ఆలోచించట్లేదని ఆమె చెప్పుకొచ్చారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: