సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించనున్నాడు. శృతి హాసన్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే ఈ మూవీ బృందం పూజ హెగ్డే నటించిన ఐటెం సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన యూ ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ యొక్క ప్రీమియర్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటికే ఈ మూవీ యూ ఎస్ ఏ ప్రీమియర్స్ 500 కే ప్లస్ ప్లీజ్ సేల్స్ లో జరుపుకుంది. ఇలా ఈ మూవీ విడుదలకు ముందే యూ ఎస్ ఏ లో అదిరిపోయే రేంజ్ రికార్డులను సొంతం చేసుకుంది. 

ఈ సినిమాకు గనుక అదిరిపోయే రేంజ్ టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ యూ ఎస్ ఏ లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించడంతో ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: