విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక అందరూ విజయ్ దేవరకొండను పక్కనపెట్టి ఆయన్నే తలుచుకుంటున్నారు.చూస్తుంటే మరో విజయ్ దేవరకొండ మన టాలీవుడ్ కి వచ్చినట్లుంది అంటూ మాట్లాడుకుంటున్నారు  మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే కింగ్డమ్ మూవీ లో విలన్ పాత్ర పోషించిన మలయాళ నటుడు వెంకటేష్ విపి.. హైదరాబాదులో జరిగిన కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అనిరుధ్ వంటి వాళ్లు మాట్లాడిన మాటల కంటే ఈ విలన్ పాత్రలో నటించిన వెంకటేష్ మాట్లాడిన మాటలే చాలా వైరల్ గా మారాయి. అప్పటివరకు విజయ్ దేవరకొండ పేరు జపిస్తున్న వాళ్లంతా ఈయన స్పీచ్ ఇవ్వడంతోనే వెంకటేష్ ని తలుచుకొని చప్పట్లు కొట్టిన వైనం ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

 మరి ఇంతకీ ఈ వెంకటేష్ విపి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది చూస్తే.. తిరువనంతపురానికి చెందిన వెంకటేష్ చిన్నప్పటినుండి సినిమాలంటే పిచ్చిగా పెరిగాడట. అయితే సినిమాల మీద ఇష్టం ఉంటే చదువేం చదువుతాడని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన చిన్నప్పటినుండి కాలేజ్ వరకు ప్రతి క్లాస్ లో ఫస్టే.. కానీ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం పోనిచ్చుకోలేదు. అలా సినిమాల మీద పిచ్చితో ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా డబ్బులు లేకపోయినా ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవాడట.అలా చివరికి మలయాళ మజవెల్ మనోరవా అనే టీవీ షోలో ఒక చిన్న అవకాశం వచ్చిందట. అలా ఆ అవకాశం వినియోగించుకొని అదే షోకి యాంకర్ గా కూడా మారి పలు సీరియల్స్ కూడా చేశారు.

ఇక మొదటిసారి మోహన్లాల్ నటించిన ఓ సినిమాలో చిన్న గుర్తింపు లేని పాత్ర వచ్చినా కూడా దాన్ని చేసి ఆ తర్వాత మమ్ముట్టి సినిమాలో కొద్దిసేపు కనిపించే పాత్రలో కూడా పోషించారట. అలా తన సినీ కెరీర్ ని దాదాపు పది సంవత్సరాలు కొనసాగించి ఫైనల్ గా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో విలన్ పాత్రను పట్టేశాడు. ఇక ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు సినిమాతో వచ్చిన డబ్బులతో తిరువనంతపురం లో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర సుడా సుడా ఇడ్లీ అంటే వేడివేడి ఇడ్లీ అనే ఇడ్లీ బండి కూడా స్టార్ట్ చేశారు.అయితే ఇక్కడ ఇడ్లీ బండి చాలా ఫేమస్.

సినిమాలు లేనప్పుడు వెంకటేష్ కూడా అక్కడికి వెళ్లి ఇడ్లీలు వేస్తూ ఉంటారట. ఇది ఆయన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన బిజినెస్ అట.అయితే ఈ విషయాలన్నీ స్టేజి మీద వెంకటేష్ చెబుతున్నంత సేపు చాలామంది ఎక్సైటింగ్ గా చూస్తారు. అప్పటివరకు వీడెవర్రా బాబు అనుకున్న వాళ్లే ఈయన స్పీచ్ కి గట్టిగా చప్పట్లు కొట్టారు. అలా ఈయన్ని చూస్తే అచ్చం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా విజయ్ అన్న ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటూ VD ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: