కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాకి "స్పిరిట్" అంటూ ఎప్పుడో నామకరణం చేసేసారు . ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు . అయితే ఈ సినిమాకి ముందు అనుకున్న కథ ప్రకారం "స్పిరిట్" అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది అంటూ ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాడు సందీప్ రెడ్డివంగా. కానీ దీపిక పదుకొనే ఎంట్రీ తో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో సీన్ మొత్తం మారిపోయింది . ఆమె తన పీఆర్ టీం దగ్గర నుంచి స్టోరీ మొత్తం లీక్ చేసేసింది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా ఆ స్టోరీని 80% మార్చేశారట . దీనికోసం ముందు అనుకున్న టైటిల్ పెద్దగా సూట్ కాకపోవచ్చు అంటూ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట .
ఈ క్రమంలోనే సినిమాకి టైటిల్ మార్చే పనిలో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్ అంటూ తెలుస్తుంది. అంతేకాదు కొత్త టైటిల్ గా "వీరుడు" అనే పేరుని చూస్ చేసుకుంటున్నారట ఇది ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు . ఆల్మోస్ట్ ఆల్ ఈ టైటిల్ ఫైనలైజ్ అయినట్లే అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ సినిమాని "స్పిరిట్" అంటూ ఇప్పటివరకు జనాలు మాట్లాడుకున్నారు . ఇది సడన్గా "వీరుడు" అని మారితే సినిమాకి ఎంత నష్టం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తుంది . చూడాలి మరి "స్పిరిట్" టూ "వీరుడు" గా కన్వర్ట్ అయిన ప్రభాస్ ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అనేది. ఇక డిసెంబర్ ఐదవ తేదీ రాజా సాబ్ సినిమాతో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్..!!