ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు. అయితే సినిమాల ప‌రంగా గ‌త కొన్నేళ్ల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ప‌వ‌న్ కు రీమేక్ చిత్రాలే త‌ప్ప స్ట్రయిట్ మూవీస్ క‌లిసి రావ‌డం లేదు. ఈ ద‌శాబ్ద కాలంలో ప‌వ‌న్ చేసిన స్ట్ర‌యిట్ మూవీస్‌లో హిట్స్ క‌న్నా ఫ్లాపులే ఎక్కువ‌. తాజాగా ఈ జాబితాలో రీసెంట్ గా విడుద‌లైన `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` కూడా చేరింది.


డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రాసిన క‌థ‌తో తెర‌కెక్కిన పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా ఇది. క్రిష్ తో పాటు ఎ.ఎం. జ్యోతి కృష్ణ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించగా.. బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్ త‌దిత‌రులు ఇతర ప్రముఖ పాత్రల‌ను పోషించారు. విప‌రీత‌మైన హైప్‌ న‌డుమ విడుద‌లైన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత క‌లెక్ష‌న్స్ డ‌ల్ అవుతూ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా ఫ్లాప్ దిశ‌గా దూసుకుపోతుంది.


అంత‌క‌న్నా ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన స్ట్ర‌యిట్ చిత్రాలు `అజ్ఞాతవాసి`, `సర్దార్ గబ్బర్ సింగ్` బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. `గోపాల గోపాల`, `కాటమరాయుడు`, `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`, `బ్రో` వంటి రీమేక్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచిగా ప‌ర్ఫార్మ్ చేశాయి. పెట్టిన బ‌డ్జెట్ ను తీసుకొచ్చాయి. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా రీమేక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న‌ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` రీమేక్ మూవీ కాగా.. మ‌రొక‌టి స్ట్రాయిట్ ఫిల్మ్ `ఓజీ`. అయితే ప‌వ‌న్ ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ ఎక్క‌డ ఓజీకి కూడా రిపీట్ అవుతుందో అని ఫ్యాన్స్ క‌ల‌వ‌ర ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: