విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ లో భాగంగా అటు నిర్మాత నాగవంశీ ,హీరో విజయ్ దేవరకొండ కలిసి పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇలాంటి సందర్భంలోనే ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది విజయ్ దేవరకొండ. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ కోసమే తన సినిమా టైటిల్ ని మార్చుకున్నామంటూ తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.



మొదట కింగ్డమ్ సినిమాకి నాగదేవర అనే టైటిల్ని అనుకున్నామని అయితే ఎన్టీఆర్ దేవర సినిమా కోసం టైటిల్ని మార్చుకున్నామంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన కింగ్డమ్ సినిమా ఒత్తిడిలో ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. ప్రతి సినిమాకు నాకు ఒత్తిడి ఉంటుంది.. ఇంతకుముందు చేసిన సినిమాలు హిట్ అయ్యిందని ప్రశాంతంగా కూర్చోలేము.. కింగ్డమ్ సినిమాకి తెలుగు తో పాటుగా ఇతర భాషలలో కూడా ఆదరణ దక్కుతోంది. ఈ సినిమా స్టోరీ నాకు చెప్పిన తర్వాత మూడు గంటలలో చెప్పడం చాలా కష్టం అనిపించింది.. అందుకే మొదటి పార్ట్ లో సూరి జర్నీ మాత్రమే చూపించామని అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడు అనే కోణంలోనే సినిమా తీశామని తెలిపారు. సినిమా చివరి నిమిషంలో మాత్రమే సూరి తన లక్ష్యం మారిపోతుంది.. కానిస్టేబుల్ తో కథ మొదలై రాజు అవ్వడంతో ఈ సినిమా ముగిస్తుందని తెలిపారు.


అయితే ఈ స్టోరీ విన్న తర్వాత రిఫరెన్స్ కోసం ది లాస్ట్ కింగ్డమ్ వంటి సిరీస్ లను కూడా చూశానని తెలిపారు.. కానిస్టేబుల్ పాత్రలో మొదట చిన్నగా కనిపించాను.. ఆ తర్వాత స్పైగా పోరాట యోధుడిగా కనిపించేందుకు సుమారుగా ఆరు మాసాలు చాలా కసరత్తులు చేశానని తెలిపారు. కింగ్డమ్ పార్ట్ 2 లో స్టార్ హీరో గా రానా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు.. ఎవరు ఉంటారన్నది డైరెక్టరే చెబుతారు. ఇక నెగిటివిటీ గురించి తాను పెద్దగా పట్టించుకోనని.. పదేళ్ల కిందట నేనంటే ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇంతమంది మనల్ని చూడడానికి వస్తున్నారంటే అది నా అదృష్టం ఇంతటి ప్రేమను పొందేలా చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: