సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప కానుక అందింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజై సంచలనం సృష్టించింది. ఈ లుక్ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాహసికుడిగా కనిపించనున్నారు. ప్రపంచాన్ని చుట్టేస్తూ, అన్వేషిస్తూ కొత్త విషయాలను కనుగొనే ఒక సాహస యాత్రికుడిగా ఆయన పాత్ర ఉండబోతుంది. ఈ కాన్సెప్ట్ మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి GEN63 అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఒక కుటుంబంలో 63వ తరానికి చెందిన వ్యక్తిగా మహేష్ పాత్ర ఉంటుందని, అందుకే ఈ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మహేష్ బాబు మరియు రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడి కలయికలో వస్తున్న ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ప్రియాంక చోప్రా జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో పాటు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: