
ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌లో అల్లు అర్జున్ సీఎం పేరును ప్రస్తావించకపోవడం, దాంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తమయ్యారన్న వార్తలు గుసగుసలుగా వ్యాపించాయి. ఆ సంఘటన మీడియా, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యములో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ స్టేజ్ పై ప్రసంగిస్తూ, సినిమా యూనిట్, అభిమానులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలిపినా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సహకారం, పోలీసుల సపోర్ట్ గురించి ప్రస్తావించలేదు. ఇది అక్కడే ఉన్న కొందరికి “అల్లు అర్జున్ మాదిరి మరోసారి పొరపాటు పునరావృతమవుతుందా?” అన్న అనుమానం కలిగించింది. కానీ ఎన్టీఆర్ ఆ మాటల మిస్సింగ్ వల్ల కలిగే పరిణామాలను ముందుగానే అర్థం చేసుకున్నట్టున్నారు.
ఈవెంట్ ముగిసిన కొద్ది సేపటికే, ఒక ప్రత్యేక వీడియో విడుదల చేసి, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల సహకారం కోసం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోతో, “అల్లు అర్జున్ చేసిన తప్పును తారక్ రిపీట్ చేయలేదు” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్పెషల్ థాంక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు “ఇదే స్టార్‌ల తెలివి… సినిమా కంటే సంబంధాలు కాపాడుకోవడం ముఖ్యం” అని అంటుంటే, మరికొందరు “ఎన్టీఆర్ జాగ్రత్తగా అడుగులు వేయడం రాజకీయాల వాతావరణానికి తగ్గట్లే” అంటున్నారు. మొత్తానికి, వార్ 2 హంగామా మొదలుకాకముందే, ఈ థాంక్స్ వీడియో ఎన్టీఆర్‌ను రాజకీయ సునామీ నుంచి కాపాడినట్టే కనిపిస్తోంది.