ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈయన విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కింగ్డమ్ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చిన ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 43.34 కోట్ల షేర్ ... 82.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 10.16 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే రేపు అనగా ఆగస్టు 14 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా విడుదల కానుంది.

అలాగే రజినీ కాంత్ హీరోగా రూపొందిన కూలీ సినిమా విడుదల కానుంది. దానితో కింగ్డమ్ సినిమాను చాలా థియేటర్ల నుండి తీసివేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వార్ 2 మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగ వంశీ విడుదల చేస్తున్నాడు. దానితో ఆయన కూడా పెద్ద ఎత్తున కింగ్డమ్ సినిమాని థియేటర్ల నుండి తీసివేసే అవకాశం ఉంది. దానితో ఆయన కింగ్డమ్ సినిమాను ఎక్కువ థియేటర్లలో ఉంచుతాడా ..? లేక వాట్ 2 సినిమాకే ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: