అనేక మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో అత్యంత తక్కువ మంది మాత్రమే అనేక సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. సౌత్ ఇండస్ట్రీ లో ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు 40 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చాక కూడా స్టార్ హీరోయిన్లతో పోటి పడుతూ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ స్టార్ ఈమేజ్ కలిగిన నటీ మణులుగా ఇప్పటికీ కెరియర్ను కొనసాగిస్తున్నారు.

ఇంతకు 40 లోకి ఎంట్రీ ఇచ్చి కూడా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ అదిరిపోయే రేంజ్ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ఆ ముద్దు గుమ్మలు ఎవరో తెలుసా ..? వారిద్దరూ మరెవరో కాదు త్రిష , నయనతార. వీరిద్దరూ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరికి కూడా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి విజయాలు దక్కాయి. దానితో వీరికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. దానితో తక్కువ కాలంలోనే వీరు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్స్ స్టేటస్ ను అందుకున్నారు. 

ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు తెలుగు లో కూడా వీరిద్దరూ స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ వైపు తమిళ్ , మరో వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. వీరు నటిస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఉండడం , వీరు తమ అందంతో , నటనతో ప్రేక్షకులను ఇప్పటికీ అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉండటంతో వీరు 40 లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: