- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షిస్తూ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం “ వార్ 2 ”. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ హాలీవుడ్ స్థాయి ట్రీట్మెంట్‌తో ఈ సినిమాను మలిచిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రెండు స్టార్ హీరోల మధ్య రైవల్రీ, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది.


ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఇద్దరు హీరోల చిన్ననాటి పాత్రలు కనబడ్డాయి. హృతిక్ రోషన్ పాత్రకు, జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు చిన్న వయసు నటులు ఎంపికయ్యారు. అయితే వీరిలో ఎక్కువ ఆకర్షణీయంగా నిలిచింది తారక్ చిన్ననాటి పాత్ర పోషించిన బాల నటుడు. తన యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఎన్టీఆర్ ఇమేజ్‌కి సరిపోయేలా ఉండటంతో ఆడియెన్స్‌లో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ బాల న‌టుడు చాలా మందికి తెలిసిన వాడే. కొన్ని ఏళ్ల క్రితం ఒక కమర్షియల్ యాడ్‌లో సంచలనం సృష్టించిన చిన్న పిల్లవాడు. “పోరా పో… పోర్ రబ్ పోర్” అంటూ సర్ఫ్ యాడ్‌లో కనిపించి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు.


ఇప్పుడు వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి పాత్ర వేసి హైలెట్ అయ్యాడు. ఈ యంగ్ నటుడు పేరు హార్టీ సింగ్. బాల్య నటుడిగా ఇప్పటికే కొన్ని కమర్షియల్స్‌లో నటించినా, ఒక పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలో ఇంత కీలకమైన రోల్ రావడం అతనికి కెరీర్ మైలురాయిగా మారింది. తన కళ్ళలోని అగ్రెసివ్ లుక్, ఎనర్జీని తెరపై బాగా చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అతనిపై ప్రత్యేకంగా ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: