యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని పాన్ ఇండియా సినిమాగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నాడు. ఈ మూవీ ని ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్లానింగ్ తో విడుదల చేశాడు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో బారి కలెక్షన్లు వస్తాయా లేదా అని అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమాను ఆయన కరెక్ట్ ప్లానింగ్ తో విడుదల చేయడం , ఆ తర్వాత మంచి పబ్లిసిటీ కూడా చేయడంతో దేవర మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. దారితో ఆయనకు ఈ సినిమా ద్వారా మంచి లాభాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తారక్ "వార్ 2" అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ లో హిందీ నటుడు హృతిక్ రోషన్ కూడా నటించాడు. ఈ సినిమా హిందీ మూవీ గా రూపొందింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను కూడా నాగ వంశీ దక్కించుకున్నాడు.

మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్లో నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ మూవీ హిందీ నెట్ కంటే మన తెలుగు కలెక్షన్లు ఎక్కువగా రావాలి అని వ్యాఖ్యానించాడు. ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన పెద్ద ఎత్తున విడుదల చేశాడు. కానీ దేవర స్థాయి కలక్షన్లు వార్ 2 మూవీ కి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం కనబడడం లేదు. అందుకు ప్రధాన కారణం నాగ వంశీ ఈ మూవీ ని అద్భుతమైన ప్లానింగ్ తో విడుదల చేసిన ఈ సినిమా తెలుగు మూవీ కాకుండా డబ్బింగ్ మూవీ అనే ఒపీనియన్ ప్రేక్షకుల్లో ఉండడం వల్ల ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర తో పోలిస్తే కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: