మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలను , పాటలను ఈ మూవీ యూనిట్ వరుస పెట్టి విడుదల చేస్తూ వస్తుంది. ఓ వైపు మాస్ జాతర సినిమా షూటింగ్లో పాల్గొంటూనే రవితేజ మరో వైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో మూవీ లో నటిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమాను విడుదల చేసే విధంగా ఈ మూవీ యొక్క షూటింగ్ను మేకర్స్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రవితేజ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రేమ కథ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శివ నిర్వాన దర్శకత్వంలో రవితేజమూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శివ నిర్వాన , రవితేజకు ఓ స్టోరీని వినిపించగా ... అది బాగా నచ్చడంతో రవితేజ , శివ నిర్వాన దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రవితేజ , శివ నిర్వాన  కాంబోలో మూవీ అంటే దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt