
ఆయన తారక్ ఇ బూతులు తిడుతూ ఆ సినిమా ఎలా చూస్తారు..? మన లోకేష్ సార్ ని ఇమంబంది పెట్టిన ఆయన సినిమా ఎలా చూస్తారు..?? అంటూ ఘాటుగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ స్పీచ్‌లో రెండు సార్లు కాలర్ ఎగరేసి మాట్లాడిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఈ తరహా ఓవర్ ఆటిట్యూడ్ చూపించేది విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ లాంటి వాళ్లు అని జనాలు కామెంట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇంత రిస్క్ ఎవరూ తీసుకోరు అని కూడా అంటున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇలా ప్రవర్తించడం వెనుక డైరెక్టర్, మూవీ మేకర్స్ ప్రభావం కూడా ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ల మాటల మాయలో పడిపోయి ఎన్టీఆర్ అలా స్పందించి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. దీని కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి స్టేజీపైకి వచ్చిన నాగవంశీ, ఎన్టీఆర్ సినిమాను ఆకాశానికెత్తి ప్రశంసిస్తూ హై ఆటిట్యూడ్ చూపించినందువల్లే ఈ సినిమా ఇంకా ఎక్కువ దెబ్బతిందని చాలామంది ఘాటుగా మాట్లాడుకుంటున్నారు.