పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కేవలం పవన్ అభిమానుల్లో మాత్రమే కాకుండా మామూలు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన హిందీ సాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

మూవీ కి సంబంధించిన హిందీ సాటిలైట్ హక్కులు అదిరిపోయే ధరకు క్లోజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క హిందీ సాటిలైట్ హక్కులను స్టార్ గోల్డ్ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా విడుదలకు చాలా రోజుల ముందే ఈ మూవీ యొక్క హిందీ సాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయి  అంటేనే అర్థం అవుతుంది ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి అనేది. ఇకపోతే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం చాలా వరకు  ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: