టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ ఈమేజ్ కలిగిన హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఈమేజ్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చరణ్ నటించిన గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ విడుదల అయింది. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయింది.

ప్రస్తుతం చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా... బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శివరాజ్ కుమార్ , జగపతి  బాబు , దివ్యాందు కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... వృద్ధి  సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఒక అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు , ఇందులో చరణ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు , అందుకోసం ఈ మూవీ లోని ఈ సాంగ్ కొరియో గ్రఫీ కోసం జానీ మాస్టర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ , జానీ మాస్టర్ కాంబో లో వచ్చిన ఎన్నో సాంగ్స్ అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీలోని చరణ్ , జానీ కాంబోలో రాబోయే సాంగ్ కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: