సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి ప్లాప్స్ వస్తే అవకాశాలు భారీ ఎత్తున తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొంత మంది బ్యూటీలకు మాత్రం వరుస పెట్టి భారీ ప్లాప్స్ వచ్చినా కూడా వరుస పెట్టి అదే రేంజ్ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఓ బ్యూటీ కి వరుసగా అనేక సినిమాల ద్వారా అపజయాలు వచ్చినా కూడా ఆమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇంతకు వరుస ప్లాప్స్ లలో కూడా అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటున్న ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కియార అద్వానీ.

ఈమె హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో ఇప్పటివరకు మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను ,  రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , గేమ్ చెంజర్ సినిమాల్లో ఈమె హీరోయిన్గా నటించింది. ఇందులో భరత్ అనే నేను సినిమాని మినహాయిస్తే వినయ్ విధేయ రామ , గేమ్ చెంజర్ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ మధ్య కాలంలో ఈమె నటించినా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇప్పటికే ఈమె నటించిన ఆఖరి 4 సినిమాలు అయినటువంటి జగ్ జగ్ జియో ,  గోవిందా మేరా నామ్ ,  సత్యప్రేమ్ కీ కథ ,  గేమ్ ఛేంజర్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

తాజాగా ఈ బ్యూటీ తారక్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో రూపొందిన వార్ 2 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆగస్టు 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోన్నట్లయితే  వరుసగా ఈ బ్యూటీ కి 5 అపజయాలు దక్కినట్లు  అవుతుంది. ఎన్ని అపజయాలు వస్తున్న కూడా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ka