
కుటుంబానికి పెద్దదిక్కు:
నందమూరి పద్మజ గారు కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి. ప్రతి శుభకార్యం, ప్రతి కుటుంబ వేడుకలో పెద్దల మాదిరిగా అన్ని బాధ్యతలు తీసుకుని చూసుకునే వారు. అందుకే ఎన్టీఆర్ తన పెద్ద కోడలుగా పద్మజను ప్రత్యేకంగా గౌరవించేవారు. నందమూరి కుటుంబ సభ్యులందరితో ఆమెకు మంచి అనుబంధం ఉండేది.
పద్మజ – జయకృష్ణ – చైతన్య కృష్ణ:
పద్మజ గారి భర్త నందమూరి జయకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పని చేశారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. వీరి కుమారుడే చైతన్య కృష్ణ . చైతన్య కృష్ణ గతంలో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైయాడు.
దగ్గుబాటి – నందమూరి కుండ మార్పిడి పెళ్లి:
పద్మజ గారి కుటుంబానికి దగ్గుబాటి కుటుంబంతో ప్రత్యేకమైన బంధం ఉంది. పద్మజ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. ఆయన మరెవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె, ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త. అంటే దగ్గుబాటి కుటుంబం – నందమూరి కుటుంబం మధ్య కుండ మార్పిడి పెళ్లి జరిగిందన్నమాట. ఈ విషయాన్ని చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు ఈ బంధం మరోసారి అందరి దృష్టిలోకి వచ్చింది.
దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సినీ ,రాజకీయ ప్రముఖులు:
పద్మజ గారి మృతి వార్త తెలిసిన వెంటనే రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి హుటాహుటిన హైదరాబాద్‌కి బయలుదేరి వచ్చారు. అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నందమూరి కుటుంబ అభిమానులు కన్నీరు మున్నీరుగా ఆమెను తలచుకుంటున్నారు. ఎన్టీఆర్ పెద్ద కోడలు నందమూరి పద్మజ గారి మరణం నందమూరి కుటుంబానికి తీరని లోటు. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా, అభిమానులు కూడా ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.