
జిమ్ లో మొదలైన ప్రేమ… పెళ్లి వరకు! .. ఒక జిమ్ లో పరిచయమైన రవి, శ్యామల మొదట్లో ఫ్రెండ్స్ మాత్రమే. కానీ క్రమంగా ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది. శ్యామల ఎవరో సాధారణ అమ్మాయి కాదు, టాలీవుడ్ హిట్ డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ కూతురు. ఈ విషయమే రవికి షాక్ ఇచ్చింది. "మన ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా ? ఆమె ఫ్యామిలీ ఒప్పుకుంటారా ?" అనే టెన్షన్ మొదలైంది. అయితే శ్యామల మాత్రం తన మనసు మార్చుకోలేదు. ఎంత కష్టాలొచ్చినా రవినే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకుంది. చివరికి తన ఫ్యామిలీని ఒప్పించి, రవి శివ తేజతో ఏకమైంది. ఇలా ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
రవి శివ తేజ మాటల్లోనే… “నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు చాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ టైంలో శ్యామల నాకు అండగా నిలిచింది. అసలు విషయం ఏంటంటే, మా మధ్య ప్రేమ మొదలయ్యే వరకు ఆమె విజయ్ భాస్కర్ గారి కూతురని నాకు తెలియదు. తెలిసాక పెళ్లి కష్టమైపోతుందేమోనని భయపడ్డా. కానీ చివరికి ఆమె ధైర్యం, పట్టుదల వల్లే మా పెళ్లి జరిగింది” అని రవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. విజయ్ భాస్కర్ కెరీర్ కూడా… నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం వంటి మధురమైన సినిమాలు తీసిన విజయ్ భాస్కర్, కొంతకాలం తర్వాత ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డారు. భలే దొంగలు, మసాలా, జిలేబి, ఉషా పరిణయం లాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా ఆయన టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు. మొత్తానికి, యూట్యూబ్ స్టార్ రవి శివ తేజ లవ్ స్టోరీకి డైరెక్టర్ కూతురు ఎమోషనల్ టచ్ తో కలిసిపోవడంతో, ఈ జంట ప్రస్తుతం యువతకు రోల్ మోడల్ గా నిలుస్తోంది.