ప్రస్తుతం ఇదే న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో పెద్ద చర్చగా మారింది. అల్లు అర్జున్ పేరు ఎప్పుడెప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా పుష్ప: ది రైజ్ సినిమా తర్వాత ఆయన ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన ఆ సినిమా అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా స్టార్ హోదా తీసుకొచ్చింది. అయితే అదే సమయంలో ఆయనకు "హెడ్ వెయిట్ పెరిగిపోయింది" అంటూ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ సర్కిల్స్‌లో రకరకాల కామెంట్లు రావడం మొదలైంది. కొంతమంది అభిమానులు ఆయనను ఆకాశానికెత్తితే, మరికొందరు మాత్రం తీవ్రంగా ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. ఈలోపే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటన బన్నీకి షాకే ఇచ్చింది. రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా మృతి చెందడం వల్ల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్‌ను ఒక రాత్రంతా కస్టడీలో ఉంచారు. ఈ సంఘటన ఆయన ఇమేజ్‌కి బిగ్ డ్యామేజ్ అయ్యిందని అప్పట్లో టాక్ నడిచింది. అయితే తర్వాత బన్నీ ఆ ఇష్యూ నుంచి బయటపడి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు.


ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుండటం తెలిసిందే. నిజానికి ఈ స్టేజ్‌లో బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాల్సింది. బన్నీ–త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఆ ప్రాజెక్ట్ సడన్‌గా హోల్డ్‌లో పడిందని, తర్వాత మాత్రం పూర్తిగా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు బయటకొచ్చాయి.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ఆ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ కనిపించబోతున్నారని ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. అంటే బన్నీ వదిలేసిన ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ ల్యాప్‌లో వేసుకున్నట్టు అవుతోంది. ఈ నేపథ్యంలో "అల్లు అర్జున్–త్రివిక్రమ్" మధ్య సంబంధాలు బాగోలేవని, ఇద్దరూ ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదని టాక్ మొదలైంది.



లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ ఏంటంటే...త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా అల్లు అర్జున్ నెంబర్‌ని బ్లాక్ చేశాడట. దానికి కారణం పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఆయన సన్నిహిత సంబంధాలే అని అంటున్నారు. బన్నీ  జనసేన పార్టీకి పూర్తి సపోర్ట్ చేయకుండా, వైసీపీ వైపు మొగ్గు చూపాడని, అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం ఆయననుంచి దూరమైందని కొంతకాలంగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే త్రివిక్రమ్, అల్లు అర్జున్‌పై అసంతృప్తి చెంది ఆయనతో గ్యాప్ పెంచుకున్నాడని ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న మాట.



ఈ వార్తలో ఎంత వరకు నిజముందో స్పష్టంగా తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ మాటల యుద్ధం సోషల్ మీడియాలో జోరందుకుంది. "బన్నీ టాప్‌స్టార్, పుష్ప 2తో మళ్లీ ఇండియా మొత్తాన్ని షేక్ చేశాడు" అంటూ బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటే, "మా చరణ్–చిరు–పవన్  నిజమైన టాప్ స్టార్స్" అంటూ మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు.



ఇకపోతే, అల్లు అర్జున్అట్లీ సినిమాలో త్రి షేడ్స్ లో కనిపించబోతున్నాడనే వార్త కూడా ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  మొత్తానికి, అల్లు అర్జున్–త్రివిక్రమ్ మధ్య నిజంగా ఎలాంటి విభేదాలు జరిగాయో తెలియదు కానీ.. ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోవాలి. కానీ ఫ్యాన్స్ యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: