నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. డైరెక్టర్ బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కూడా ధీమాతో ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఇందులో విలన్ గా హీరో ఆది పినిశెట్టి కనిపించబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి, బాలకృష్ణ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా బాలకృష్ణతో స్క్రీన్ పై కనిపించడం చాలా అదృష్టమని.. ఆయన స్క్రీన్ పైన ఎలా ఉంటారో నిజజీవితంలో కూడా అలాగే ఉంటారు. ఆయన ఒక సూపర్ హౌస్ లాంటి వ్యక్తి అంటూ తెలియజేశారు. ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తి, కష్టపడి పనిచేసే వారికి బాలయ్య ఉదాహరణ అంటూ తెలియజేశారు ఆది పినిశెట్టి. డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో కూడా ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రాలలో తనకు అవకాశం లభించిందని తెలియజేశారు.


మనందరిలో కూడా ఒక విలన్ ఉన్నారని తాను అనుకుంటున్నాను అయితే పరిస్థితి మనం పాజిటివ్, నెగిటివ్గా మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము.. ఎప్పుడు పాజిటివ్ గా ఉండే పాత్రలు చేస్తే ఒకానొక దశలో వాటికి ఆసక్తి ఉండదు. విలన్ పాత్రకు హద్దు అనేది ఉండదు నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి నాయకుడు పాత్రలు చాలా ఆసక్తిని కలిగిస్తాయని తెలియజేశారు ఆది పినిశెట్టి. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందని తెలిపారు. అఖండ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడడంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సెప్టెంబర్ 25న  అఖండ 2 సినిమా రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్రకటించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకొని బాలయ్య కెరియర్లో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: