
ఆ కారణంగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానుల్లో కీర్తి సురేష్ పేరు ఎల్లప్పుడూ ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. మహానటి సినిమాలో ఆమె నటించిన పర్ఫార్మన్స్, చూపించిన డెడికేషన్‌ను ఎవరు మర్చిపోలేరు. ఇప్పటివరకు కీర్తి సురేష్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఏదైనా ఉందంటే, అది మహానటి మాత్రమే. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో ఆమె నటించి మంచి పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకుంది. అయితే మహానటి స్థాయి హిట్ ఇప్పటివరకు రాలేకపోయింది. దసరా సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. కానీ పెళ్లి తర్వాత ఆమె వేసే ప్రతి స్టెప్ ఫెయిల్ అవుతుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టి ఎక్స్పోజ్ చేసిన కీర్తి సురేష్‌పై తెలుగు ప్రేక్షకులు కూడా కొంతమంది మండిపడుతున్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమలో ఆమె గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. రీసెంట్‌గా, కీర్తి సురేష్ ఒక తమిళ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. డ్రం స్టిక్స్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇది కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నారు. కీర్తితో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం. అయితే, ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ తీసుకోవడం, కొత్త దర్శకుడితో పని చేయడం కీర్తికి ఎలాంటి రిస్క్ తెస్తుందో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు స్క్రీన్ టైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. కీర్తి సురేష్ ప్రెజెంట్ ఉన్న హీరోయిన్స్‌తో కాంపిటీటివ్‌గా ముందుకు వెళ్లాలంటే, ఆమె కథలను, స్టైల్‌ను పరిశీలించి కొత్తగా మార్చుకోవాలి అని అభిమానులు సూచిస్తున్నారు.
ఇక కీర్తి సురేష్ ఇప్పటికే తమిళంలో "రివాల్వర్ రీటా" సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరో చిత్రం "కన్నె వేడి" ప్రస్తుతంలో షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏదైనా హిట్ కాకపోతే, కీర్తి సురేష్ రీసెంట్ నిర్ణయాలను రివ్యూ చేయాల్సి వస్తుంది. కానీ ఈ రెండు సినిమాల నెగిటివ్ రిస్పాన్స్ ఉంటే, ఆమె కెరియర్‌లో పెద్ద రిస్క్ పడే అవకాశం ఉంది. చూడాలి కీర్తి సురేష్ తన కెరీర్‌ను టాప్ పొజిషన్‌కి ఎలా తీసుకెళ్తుందో..???