టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘మాస్ జాతర’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా, అనివార్య కారణాల వల్ల ముందే వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా కుదరదనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో అభిమానుల్లో కొత్త ఆసక్తి మొదలైంది – ఇంకా ఎప్పుడికి వస్తుంది ఈ మాస్ ఫెస్టివల్? ఇండస్ట్రీ టాక్ ప్రకారం, సినిమా మొత్తం ఫైనల్ కట్ చూసిన తర్వాత టీమ్ కొన్ని మార్పులు అవసరమని నిర్ణయించుకుంది. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో రీషూట్లు చేయాలని భావించారు.
 

ఇక ఇందుకోసం హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీలతో పాటు మరికొందరు కీలక నటీనటుల డేట్స్ మళ్లీ కావాల్సి వచ్చింది. అందరి షెడ్యూల్ ఒకే లైన్‌లో రావడం కష్టం కావడంతో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం ఇప్పటికీ సాధ్యపడట్లేదు. ఇక మరో వైపు నిర్మాతలైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పరిస్థితి కూడా రిలీజ్ ఆలస్యానికి కారణమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన కింగ్‌డమ్, వార్ 2 సినిమాల వల్ల భారీ నష్టాలు చవిచూసింది ఈ బ్యానర్. దీంతో ఇక తప్పకుండా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగవంశీ కూడా ఈ సారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వార్ 2 హిట్టయితే, ఉత్సాహంలో మాస్ జాతరని కాస్త లైట్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఫలితం తేడా కొట్టడంతో ఈ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టడం మొదలెట్టారు.



ముఖ్యంగా రవితేజ కేరియర్‌కి కూడా ఈ సినిమా టర్నింగ్ పాయింట్ కావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అందుకే మాస్ జాతరని ఆల్‌టైమ్ మాస్ ట్రీట్‌గా మలచాలని టీమ్ ఆలోచిస్తోంది. చిన్న తప్పిదమే పెద్ద ట్రోలింగ్‌కు దారి తీసే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అలాంటి నెగటివ్ వేవ్‌ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ నిజాన్ని నాగవంశీ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే రిలీజ్ ఆలస్యమైనా పరవాలేదు కానీ, సినిమా క్వాలిటీపై ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు.మొత్తం మీద, రవితేజ – శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న మాస్ జాతర కోసం అభిమానులు కాస్త ఎక్కువ కాలం ఆగాల్సిందే. కానీ జాగ్రత్తగా తయారు చేస్తే, ఈ ఆలస్యం చివరికి మాస్ ఫెస్టివల్‌గా మారిపోవడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: