అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన దాదాపు 40% షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించబోతుండడం, అభిమానులందరిని ఫ్యాన్స్ ఉత్సాహానికి మించి ఉంచే విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతుంది అని వార్తలు చెబుతున్నాయి. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ, ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో అభిమానులందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకంగా, చిరంజీవి యొక్క ఒరిజినల్ నేమ్‌ను "మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు" అని టైటిల్ పెట్టారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు మరింత ఆకర్షణీయంగా నిలిచింది.

వాస్తవానికి, ఈ సినిమా టైటిల్‌ను మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో తన వేరే సినిమాకు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట.  కానీ కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ అందుకు అంగీకరించలేదు. ఆ సినిమా మరేంటో కాదు  "శంకర్ దాదా ఎంబిబిఎస్", . హీరోయిన్గా సోనాలి బింద్రే నటించిన ఈ సినిమాలో  శ్రీకాంత్ ‘ఏటీఎం’ పాత్రతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొదటగా ఈ సినిమాకు "శివ శంకర్ వరప్రసాద్ ఎంబిబిఎస్" అని టైటిల్ పెట్టాలి అనుకున్నారట. కానీ డైరెక్టర్ ఆ టైటిల్‌కు అంగీకరించలేదట.

"శంకర్ దాదా ఎంబిఎస్" టైటిల్ క్యారెక్టర్ పరంగా కూడా బాగుంటుందని, అందువల్ల చివరికి టైటిల్ మార్చారట. ఒకవేళ ఆ రోజు డైరెక్టర్ అంగీకరించి టైటిల్ పెట్టి ఉంటే, ఈపాటికి ఆ పేరు వేరే రేంజ్ లో మారుమ్రోగిపోయేది. జస్ట్ మిస్ . కానీ అనిల్ రావిపూడి  అదృష్టవశాత్తూ ఆ ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తుండడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ ఘరాన మొగుడు సినిమాలో లాగా ఉంటుంది అంటున్నారు మూవీ మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: