టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అద్భుతమైన జోష్లో సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమాలో అత్యంత భారీ ఎత్తున గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండడంతో ఈ మూవీ కాస్త డిలే అవుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంత కాలం క్రితమే చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టాడు.

తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ను ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. ఈ సినిమాకు మన శంకర వర ప్రసాద్ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని చెప్పిన విధంగా సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల చేయడం కోసం అనిల్ రావిపూడి ఒక్క రోజును కూడా వృధా చేయకుండా ఈ సినిమా షూటింగ్ను అనుకున్న దాన్ని అనుకున్న ప్రకారం పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమా షూటింగ్ను పక్కా ప్లానింగ్ తో పూర్తి చేయడం మీద మాత్రమే కాకుండా అనిల్ రావిపూడి మరో విషయంపై కూడా అత్యంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే విషయంలో అనుకుంటున్నారా ..? బడ్జెట్ను కంట్రోల్ చేయడంలో. మన శంకర వర ప్రసాద్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం అనిల్ రావిపూడి ఏ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాడో అదే విధంగా ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ లోపు కచ్చితంగా పూర్తి చేసే విషయంలో కూడా ఆయన చాలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనిల్ , చిరు సినిమా కోసం డబల్ డ్యూటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: