మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కేరిర్ను ముందుకు సాగించింది. ప్రారంభంలో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ షో పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గత కొన్ని సంవత్సరాలుగా గ్లామర్ షో కు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు చాలా దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి వాటితో కూడా మంచి విజయాలను అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక ధియేటర్ హక్కులను అమ్మి వేశారు. 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఈ సినిమా యొక్క మొత్తం కర్ణాటక థియేటర్ హక్కులను పిఏ ప్రొడక్షన్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు , ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం పీఏ ప్రొడక్షన్స్ సంస్థ వారు ఈ మూవీ ని కర్ణాటక ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఘాటి సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: