సినిమా ఇండస్ట్రీ లో అత్యంత కష్టాల్లో ఉండే వారిలో నిర్మాత మొదటి స్థానంలో ఉంటాడు అని , దానికి ప్రధాన కారణం ఓ సినిమా మొదలు అయిన తర్వాత అన్నింటికీ నిర్మాత ఖర్చు పెడుతూ ఉంటాడు. హీరోకి గానీ , హీరోయిన్ కి గాని , దర్శకుడికి గాని , ఇతర నటి నటులకు గాని , టెక్నిషన్స్ కి గాని అందరికీ ముందే అతను పారితోషకాలు ఇస్తాడు. దానితో అందరూ సినిమా బాగున్న  , బాగో లేకపోయినా దాని వల్ల లాభాలు వచ్చిన  , నష్టాలు వచ్చినా , మిగతా వాళ్లంతా సేఫ్ గా ఉంటారు. ఒక నిర్మాత మాత్రం సినిమా విడుదల అయ్యి  , మంచి టాక్ ను తెచ్చుకొని , మంచి కలెక్షన్లను ఆ మూవీ రాబడితేనే సేఫ్ జోన్ లోకి వెళ్తాడు. అందుకే నిర్మాత ఎప్పుడు కష్టాల్లో ఉంటాడు అని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు.

కానీ కొంత మంది హీరోలు మాత్రం నిర్మాతల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించి , ఆ మూవీ మంచి లాభాలను అందుకుంటేనే  తమ డబ్బులను తీసుకోవడానికి ముందుకు వస్తారు. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో అనిల్ సుంకర ఒకరు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం అఖిల్ హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే మూవీ ని రూపొందించాను. 

మూవీ సమయం లోనే అఖిల్ సినిమా విడుదల అయ్యాక , మంచి విజయం సాధించి , నాకు లాభాలు వస్తేనే పారితోషకం తీసుకుంటాను అని చెప్పాడు. ఇక సినిమా విడుదల అయింది. ఆ మూవీ భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీ ద్వారా నాకు నష్టాలు వచ్చాయి. దానితో అఖిల్మూవీ కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు అని అనిల్ సుంకర తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇలా అనిల్ సుంకర , అఖిల్ "ఏజెంట్" మూవీ కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు అని చెప్పడంతో అఖిల్ అభిమానులంతా మా హీరో ఎంతో గ్రేట్ అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: