మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ తాజాగా పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. మంచి క్రేజ్ ఉన్న నటి అయినటువంటి అనుపమ నటించిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయితుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది అనే ఉద్దేశంతో థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ థాంక్యూ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొంది. ఈ మూవీ థాంక్యూ మీట్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ... ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు సినిమాలో పరదా లాంటి సినిమా ఒక డేరింగ్ స్టెప్. ఇలాంటి డేరింగ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత  విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా. నా కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ మూవీ లో ఇచ్చాను అని రివ్యూస్ రాశారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్న అస్సలు పట్టించుకోరు. కానీ మా సినిమాను మాత్రం భూతద్దం పెట్టి చూస్తున్నారు.

అలా సినిమాలు చూడొచ్చు ... తప్పేమీ లేదు. కానీ చేసిన ప్రయత్నాన్ని మాత్రం విమర్శించవద్దు అని అనుపమ తాజాగా పరదా సక్సెస్ థాంక్యూ మీట్ లో భాగంగా మాట్లాడింది. ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు కాస్త దూరంగా ఉన్న ఈ మధ్య కాలంలో ఈమె నటించిన రౌడీ బాయ్స్ , టిల్లు స్పేర్ మూవీ లలో మాత్రం ఈమె అందాల డోస్ ను ఫుల్ గా పెంచి కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: