మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటీమని అయినటువంటి అనుష్క శెట్టి తాజాగా ఘాటి అనే సినిమాలో నటించింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి , సాయి బాబా జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి రాజీవ్ రెడ్డి తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.

ఇక ఈ మూవీ నిర్మాతలను ఒకరు అయినటువంటి రాజీవ్ రెడ్డి తాజా విలేకరుల సమావేశంలో భాగంగా ఘాటి మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఇచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... రాజీవ్ రెడ్డి కి తాజా విలేకరుల సమావేశంలో భాగంగా ఘాటీ మూవీ కి సినిమాకు కొనసాగింపుగా ఘాటీ 2 ఉండే అవకాశం ఏమైనా ఉందా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... ప్రస్తుతానికి ఘాటి సినిమాకు కొనసాగింపుగా ఘాటీ 2 మూవీ చేసే ఆలోచన లేదు.

సినిమా విడుదల అయిన తర్వాత మూవీ అద్భుతమైన విజయం సాధిస్తే ఘాటీ 2 గురించి అప్పుడు ఆలోచిస్తాం. ఘాటి సినిమాకు ఘాటీ 2 చేసే స్కోప్ కూడా ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ నిర్మాత చెప్పిన దాని ప్రకారం ఘాటీ మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించినట్లయితే ఘాటీ 2 మూవీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఘాటి మూవీ అలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం పేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఘాటి మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: