
ఇప్పటివరకు ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మహిళలకే జరిగే ఇబ్బందులు. కానీ ఇది కేవలం ఆడవాళ్లకే పరిమితం కాదు. మగవాళ్లూ కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు అని కొంతమంది హీరోలు స్వయంగా బయట పెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్టార్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాన్ని పబ్లిక్‌గా చెప్పిన సందర్భం సంచలనమైంది. ఒక పెద్ద బ్యానర్‌లో సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ కొందరు అతని నంబర్ తీసుకుని “మరో చిన్న ఆఫర్ ఉంది” అంటూ ఆఫీస్‌కి రావాలని చెప్పారట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ లేడీ అతనితో అసభ్యకరంగా మాట్లాడుతూ బట్టలు విప్పి నిలబడమని డిమాండ్ చేసిందని ఆ హీరో ఓపెన్ గా వెల్లడించాడు. ఇది వినగానే చాలామంది షాక్ అయ్యారు.
కేవలం టాలీవుడ్‌లోనే కాదు, మలయాళ సినీ ఇండస్ట్రీలో కూడా ఒక స్టార్ హీరో ఇదే అనుభవం తనకూ ఎదురైందని బయట పెట్టాడు. “క్యాస్టింగ్ కౌచ్” పేరుతో మమ్మల్నీ ఇలాగే బాధపెట్టారు అని చెప్పాడు. ఈ విషయాలు బయటికి రావడంతో, ఇలాంటి సమస్యలు మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉంటాయన్న విషయం స్పష్టమైంది. తేడా ఏంటంటే, మహిళలు ఈ బాధలను బహిరంగంగా చెప్పుకుంటే, పురుషులు మాత్రం ఎక్కువగా చెప్పుకోరు. సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ రంగంలో అయినా ఇలాంటి సమస్యలు పూర్తిగా లేకుండా పోవు. అధికారం, అవకాశాలు, గ్లామర్ ఉన్న చోట ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే మన జాగ్రత్త, మన ధైర్యమే ఇలాంటి సందర్భాల్లో రక్షణగా మారుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇదే సలహా ఇస్తున్నారు .. “ప్రతీ ఒక్కరు తమ సరిహద్దులు కాపాడుకుంటే, ఇలాంటి కష్టాలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు తగ్గుతాయి” అని మాట్లాడుతున్నారు..!