
ఈ మధ్యే నాని నిర్మాతగా కూడా టర్న్ తీసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ యాక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్న నానికి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఈ ప్రశ్నకు నానినే స్వయంగా సమాధానం చెప్పారు. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` టాక్ షోలో పాల్గొన్న నాని.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి ఎన్నో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కూడా రివీల్ చేశారు. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, నీరజ కోన.. ఈ ముగ్గురూ నానికి బెస్ట్ ఫ్రెండ్స్. అర్థరాత్రి కాల్ చేసిన పరిగెత్తుకొస్తారట. మిడ్ నైట్ ఏదైనా సహాయం కావాలంటే మొట్టమొద మెసేజ్ చేయగలిగేంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఆ ముగ్గురే అని నాని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం నాని `ది ప్యారడైజ్` మూవీతో బిజీగా ఉన్నాడు. దసరా వంటి బ్లాక్ బస్టర్ అనంతరం నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన నాని ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ దశలో ఉన్న ది ప్యారడైజ్ 2026 మార్చిలో విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.