పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తూ ఉండగా ... సుజిత్ అనే యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... అర్జున్ దాస్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25.వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఒక దాని తర్వాత ఒక దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు అత్యంత భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 150 కోట్లకు అమ్మాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 150 కోట్ల ధరకు అమ్ముడు పోయినట్లయితే ఇది పెద్ద రికార్డు అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk