సినిమా ఇండస్ట్రీ లో చాలా కష్టాలను ఎదుర్కొనే వారిలో నిర్మాతలు మొదటి స్థానంలో ఉంటారు. సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించే వరకు వారికి ఆ సినిమాతో లాభాలు వస్తాయా  ..? నష్టాలు వస్తాయా అనేది కూడా తెలియదు. దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లోనే సినిమా ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లు అనే వారు చాలా శాతం సినిమా చూడకుండానే ఆ సినిమాపై ఉన్న అంచనాలను బట్టి మూవీని కొనేస్తూ ఉంటారు. సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల అంచనాలను ఆ మూవీలు అందుకున్నట్లయితే దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. ఆ తర్వాత నిర్మాతలకు కూడా ఆ మూవీ ల ద్వారా లాభాలు వస్తాయి.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా మంచి క్రేజ్ కలిగిన వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరో గా కింగ్డమ్ అనే సినిమాను నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ ద్వారా నాగ వంశీ కి పెద్ద మొత్తంలో లాభాలు ఏమీ రాలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. నాగ వంశీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా రూపొందిన వార్ 2 మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను అత్యంత భారీ ధరకు కొనుగోలు చేశాడు.

కానీ ఈ మూవీ ద్వారా ఈయనకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే మలయాళం లో కళ్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో రూపొందిన కొత్త లోక అనే సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఈయన కొనుగోలు చేశాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక చిన్న సినిమాతో ఈయనకు పెద్ద మొత్తంలో లాభాలు రాబోతున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: