కోలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో ఏ ఆర్ మురగదాస్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ అనే తెలుగు సినిమాలను కూడా రూపొందించాడు.

ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు చాలా వరకు బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆఖరుగా ఈయన సల్మాన్ ఖాన్ హీరో గా సికిందర్ అనే మూవీ ని రూపొందించాడు  ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ తో మురగదాస్ తుపాకి , కత్తి , సర్కార్ అనే మూడు సినిమాలను రూపొందించాడు. ఇక మొదటగా వీరి కాంబోలో వచ్చిన తుపాకి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన కత్తి సినిమా కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక వీరి కాంబోలో వచ్చిన మూడవ సినిమా అయినటువంటి సర్కార్ మాత్రం పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. తాజాగా మురగదాస్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... తుపాకి , కత్తి తర్వాత విజయ్ తో డ్రై యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన రోడ్డు ట్రిప్ మూవీ చేయాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చివరగా విజయ్ తో సర్కార్ కథతో మూవీ చేయవలసి వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా మురగదాస్ శివ కార్తికేయన్ హీరో గా మదరాసి అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: