
టాలీవుడ్‌లో థియేటర్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఏదో ఒక సినిమా హిట్టయ్యేది కానీ ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అందుకే సినిమా హిట్టయితేనే నటీనటుల కెరీర్‌కి బెనిఫిట్ ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నెల 5న అనుష్క నటించిన ఘాటీ సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన అనుష్క, ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె కెరీర్ ఇప్పుడు 'ఘాటీ' సినిమాపై ఆధారపడి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అనుష్క కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన అరుంధతి, భాగమతి సినిమాల కలెక్షన్స్‌ని 'ఘాటీ' అధిగమిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ సినిమా విజయం అనుష్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని అభిమానులు, సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి అనుష్క అభిమానుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు చేరుకుంటుందో చూడాలి.
అయితే అనుష్క ఈ సినిమాకు డైరెక్ట్ ప్రమోషన్స్ చేయకపోయినా రానాతో ఫోన్ కాల్ ద్వారా తన వంతు పబ్లిసిటీ వచ్చేలా చేశారు. మునుపటి లుక్ లోకి రాకపోవడం వల్లే అనుష్క మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. హీరోయిన్ అనుష్క భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఘాటీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తే మాత్రం అనుష్కకు తిరుగుండదని చెప్పవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు