పైన ఫోటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా వారిని గుర్తుపట్టారా ..? ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ కలిగిన స్టార్ నిర్మాత అయితే మరొకరు ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు. ఇంతకు ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా ..? వారు మరెవరో కాదు ... ఈ ఫొటోలో ఉన్నది స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు. అలాగే ఓ మై ఫ్రెండ్ , ఎంసీఏ , వకీల్ సాబ్ , తమ్ముడు సినిమాల డైరెక్టర్ అయినటువంటి వేణు శ్రీరామ్. ఇక ఇదే ఫొటోలో వీరి పక్కన ఉన్న మరో వ్యక్తి దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్. పై ఫోటోలో ఉన్న సన్నివేశం అల్లు అర్జున్ హీరో గా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య సినిమాలోనిది.

తాజాగా స్టార్ నిర్మాత అయినటువంటి బన్నీ వాసు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో భాగంగా ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఇక బన్నీ వాసు అది చూసి నవ్వుకొని ఇది ఏ సినిమాలోని సన్నివేశం ..? మేము ఎందుకు ఆ సినిమాలో నటించాం ..? అనే దాని గురించి ఆయన క్లారిటీగా చెప్పుకొచ్చాడు. తాజా ఈవెంట్లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ ... ఆ రోజు ఆర్య సినిమా షూటింగ్ చివరి రోజు. ఓ ముగ్గురు ఆర్టిస్టులు ఆ రోజు షూటింగ్ కు రాలేదు. దీంతో దిల్‌ రాజు ఆఫీస్‌ క్యాషియర్‌ శ్రీధర్‌ , దర్శకుడు శ్రీరామ్‌ వేణు మరియు నేను ముగ్గురం కలిసి ఈ సీన్ లో నటించాం.

ఇది సుకుమార్‌ గారి ఆలోచనే.  మీరు ముగ్గురూ చాలా ఖాళీగా ఉన్నారు కదా  ముందుకు రండి అని మాపై ఈ సన్నివేశం చిత్రీకరించారు. ఆర్య సినిమాలోని ఆ సన్నివేశం  చూశాక మా ఆవిడ నన్ను బాగా తిట్టింది.  ఇక అప్పటి నుంచి నేను ఏ సినిమాలోనూ కనిపించలేదు అని బన్నీ వాసు తాజాగా చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: