ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్ పరీక్ష షెడ్యూల్  ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరిగే ఫస్ట్ ,సెకండ్ ఇయర్  పరీక్షల టైం టేబుల్ ని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అయిన నారాయణ భరత్ గుప్తా తాజాగా విడుదల చేసినట్లు తెలిసింది. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన మొదలు కాబోతున్నాయని మార్చి 24వ తేదీ వరకు వివిధ కోర్సులకు సంబంధించి పరీక్షలు నిర్వహించబోతున్నారు.


అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 23వ తేదీ వరకు కొనసాగుతాయి. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ పరీక్షలు.. వచ్చే ఏడాది జనవరి 21వ తేదీ నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట సమయం వరకు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ పరీక్ష జనవరి 23వ తేదీన ఉండబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జనరల్ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయి.


జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒకేషనల్ కోర్సులు, అలాగే సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 13వ తేదీన జరిగే విధంగా షెడ్యూల్ ఉంటుందంటూ తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈ షెడ్యూల్ తాత్కాలికమని.. 2026 హాలిడేస్ క్యాలెండర్ ని బట్టి కొన్ని డేట్ లలో మార్పు ఉండే అవకాశం ఉంటుందంటూ తెలియజేస్తున్నారు ఎడ్యుకేషన్ కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా. విద్యార్థులు కూడా పరీక్షల పైన ప్రత్యేకించి దృష్టి పెట్టీ చదవాలని , తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపైనా దృష్టి పెట్టాలి అంటు అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా కాలేజీ యాజమాన్యాలు సిలబస్  పూర్తి చేయని యెడల పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: